జగన్ తెలంగాణలో పర్యటిస్తే మానుకోటే: మధుయాష్కీ

Madhuyaskhi fires at YS Jagan
హైదరాబాద్/నిజామాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే మానుకోట సంఘటన పునరావృతమవుతుందని హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకునేందుకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు లక్షల రూపాయలు ఖర్చు చేశాయని మధుయాష్కీ ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఆ పార్టీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుందని టిడిపిపై మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైన వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రథముడని అన్నారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కిరణ్ అని ఆయన విమర్శించారు.

610కి విరుద్ధంగా ఉన్నవారు వెళ్లిపోవాలి: దేవీప్రసాద్

హైదరాబాద్‌లో ఉంటున్న సీమంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు దేవి ప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 610 జీవో, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని అన్నారు.

విభజన పూర్తయిన తర్వాతే పాలసీపరమైన నిర్ణయాలు తీసుకోవాలని దేవీప్రసాద్ అన్నారు. ఇరు ప్రాంతాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకుల వలలో పడొద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+