ఏపీ కొత్త ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.కనగరాజ్ నియామకం
అమరావతి: శుక్రవారం రోజున ఏపీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫోకస్ ఒక్కసారిగా పాలిటిక్స్ వైపు మరలింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం, అందుకు గవర్నర్ ఆమోదం తెలపడం, ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
Recommended Video
అనంతరం ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికల సంఘంలో కార్యదర్శిగా ఉన్న రామసుందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉండటం అనే వార్త బయటకు రావడం జరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్షాలు రంగంలోకి దిగి జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి. ఇక మార్పులు చేసిన ప్రకారమే హైకోర్టు రిటైర్డ్ జడ్జినే ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉంటారని చెప్పిన ప్రభుత్వం ఆమేరకు కసరత్తు చేసింది.

రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు జస్టిస్ వి.కనగరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వి.కనగరాజ్ పనిచేశారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధిచి కీలక తీర్పులు ఇచ్చారు జస్టిస్ వి. కనగరాజ్. మద్రాస్ లా కాలేజీలో 1972 లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జస్టిస్ కనగరాజ్.. 1973లో మద్రాస్ బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 1997 ఫిబ్రవరి 24న మద్రాస్ హైకోర్టు జడ్జిగా కనగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో 69వేల కేసుల్లో తీర్పు ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా యూనివర్శిటీకి సెనేట్‌గా కూడా సేవలందించారు. ఇక మూడేళ్ల పాటు జస్టిస్ కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవిలో కొనసాగనున్నారు. అవసరమైతే మరో మూడేళ్లు పొడగించేలా చట్టంలో మార్పులు చేసింది ప్రభుత్వం.













Click it and Unblock the Notifications