హరహర మహాదేవ: మహా శివరాత్రి లింగోద్భవ ప్రాశస్త్యం ఇదే!!

భక్తవ శంకరుడు, భోళా శంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఈ మహా శివరాత్రి రోజు. హిందువులందరూ ఏటా జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండుగలలో మహా శివరాత్రి ఒకటి. మహా శివరాత్రి అంటే శివునికి అత్యంత ఇష్టమైన రోజు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దృక్ పంచాంగ్ ప్రకారం, ఇది మాఘ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది.

అనేక ఇతిహాసాలు, పురాణాలు ఈ పవిత్రమైన మహా శివరాత్రికి సంబంధించిన అనేక విషయాలను ప్రబోధం చేశాయి. లింగోద్భవం పై కూడా ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని తన ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెబుతాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడే లింగోద్భవం జరిగిందని చెప్తారు.

Maha shivratri 2024 today Lingodbhavam importance

అయితే అది తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో మూలం కనుక్కోవడానికి వెళతాడు. అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పై భాగం వైపు వెళ్తాడు. ఇద్దరూ మహా శివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేకపోతారు. అయితే బ్రహ్మకు ఆ సమయంలో కేతకీ పుష్పం, గోవు దర్శనమిస్తాయి. మొగలిపువ్వు, గోవుకి తాను శివలింగానికి ఆది కనుక్కున్నాను అని చెప్పి, అదే విషయాన్ని విష్ణు, శివుడి ముందు చెప్పాల్సిందిగా చెబుతాడు.

దీంతో గోవు, మొగలి పువ్వు బ్రహ్మ చెప్పినట్లుగా శివుడి వద్ద అబద్ధం చెబుతారు. వారు అబద్ధం చెబుతున్నారు అని గ్రహించిన శివయ్య మొగలి పువ్వు ను, గోమాతను శపిస్తాడు. అబద్ధం చెప్పించినందుకు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి, పూజలు కానీ ఉండవని శాపం ఇస్తాడు. మొగలి పువ్వు పూజకు పనికిరానిదిగా శివుడు శాపం ఇస్తాడు.

ముఖంతో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పిన గోమాత అబద్దం చెప్పిన ముఖాన్ని చూస్తే పాపంగా, గోమాత తోక ని చూస్తే పాపపరిహారం గా శివుడు శపిస్తాడు. మహావిష్ణువు శివలింగానికి అంతం కనుక్కోలేకపోయానని శివుడికి నిజం చెప్తాడు. సత్యం చెప్పడం వల్ల ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తారు పరమశివుడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం ,మోక్షాన్ని ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇస్తారు.

ఇదంతా లింగోద్భవ కాలంలోనే జరిగిందని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ప్రధానంగా చెప్పబడింది. ఇక బ్రహ్మ కూడా శివుడికి లింగరూపం లోనే ఉంటావని శాపాన్ని ఇవ్వడం వల్ల ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకం చేసే ప్రాధాన్యత ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో పరమ శివుడు సర్వాంతర్యామి అన్న విషయం విదితం అవుతుంది. లింగోద్భవం వెనుక ఉన్న ప్రధాన రహస్యం ఇదేనని చెప్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+