ఇది కదా తిరుపతి అంటే..!!
Maha Shivratri 2025: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి.
అంకురార్పణతో..
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు ఆరంభం అయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు వైభవంగా కొనసాగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు ఆలయ అర్చకులు. సర్వదేవతలనూ ఆహ్వానించారు.

తొలి రోజు ఇలా..
తొలి రోజున ఉదయం- ధ్వజారోహణం, రాత్రి హంస వాహనంపై కపిలేశ్వర స్వామివారు ఊరేగుతారు. 20వ తేదీన ఉదయం- సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై దర్శనం ఇస్తారు. 21వ తేదీన ఉదయం- భూత వాహనం, రాత్రి సింహ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
ముక్కంటికి వ్యాఘ్ర వాహనం..
22న ఉదయం- మకర వాహనం, రాత్రి శేష వాహనం, 23న ఉదయం- తిరుచ్చి ఉత్సవం, రాత్రి- నంది వాహన సేవను నిర్వహిస్తారు. 24న ఉదయం- వ్యాఘ్ర వాహనం, రాత్రి గజ వాహనంపై కపిలేశ్వర స్వామివారిని ఊరేగిస్తారు. 25న ఉదయం- కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వ వాహన సేవలు ఉంటాయి.
త్రిశూల స్నానం.. ప్రత్యేకం
26న ఉదయం రథోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. రాత్రి నందివాహనంపై స్వామివారు ఊరేగుతారు. 27న ఉదయం పురుషా మృగవాహనం, సాయంత్రం కల్యాణోత్సవం ఉంటుంది. రాత్రి తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 28న ఉదయం త్రిశూల స్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, రాత్రి రావణాసుర వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
వెలిగిపోతున్న కపిలతీర్థం..
ఈ ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు కపిలతీర్థం ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున.. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. చలువ పందిళ్లు వేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.
శ్రీనివాసమంగాపురంలో..
మరోవంక శ్రీనివాసమంగాపురంలో వెలిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా మంగళవారమే ఆరంభం అయ్యాయి. మొదటిరోజు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు పరమపద వైకుంఠ నాథుని అలంకారంలో కటాక్షించారు.
మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు..
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలతో తిరుపతి అలరారుతోంది.
-
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications