శంభో శివ శంభో.. ఏపీలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు; ఆలయాలకు పోటెత్తిన భక్తులు!

మహాశివరాత్రి పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఏపీలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోను, శ్రీకాళహస్తిలోనూ, పాలకొల్లులోని క్షీర రామ లింగేశ్వర ఆలయంలోనూ, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలోనూ అత్యంత ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. పంచారామ క్షేత్రమైన చాణిక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తజనం పోటెత్తారు.

ప్రసిద్ధశైవ క్షేత్రాలలో శివరాత్రి వేడుకలు
మరోవైపు పల్నాడు జిల్లా కోటప్పకొండ లో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి . తెల్లవారుజామున రెండు గంటల నుంచి ప్రత్యేక పూజలతో త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి. ముమ్మడివరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలోనూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తారు.

Maha Shivratri 2025 celebrations in AP in a grand manner Devotees flock to temples

శ్రీకాళహస్తి భక్తులతో కిటకిట
కాకినాడ జిల్లా పిఠాపురం స్వయంభు శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి క్షేత్రానికి అర్ధరాత్రి నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వామి వారికి అర్చనలు అభిషేకాలు చేస్తున్నారు.తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయంలో బారులు తీరారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు.

శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏడవ రోజు గజ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవారికి నేడు మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. మహాశివరాత్రిపర్వదిన సందర్భంగా పశ్చి మగోదావరి జిల్లాలోని శివ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిట లాడుతున్నాయి.

పంచారామక్షేత్రాలలో శివరాత్రి ఘనంగా
గోదావరి తీరం శివనామ స్మరణలతో మార్మోగుతోంది. పంచారామ క్షేత్రాలైన భీమవరంలోని శ్రీఉమా సోమేశ్వ ర జనార్ధన స్వామి ,పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాలలో భక్తులు తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో నిలబడ్డారు . స్వామివారికి పాలాభిషేకాలు నిర్వహించారు. మరోవైపు గుంటూరు జిల్లా అమరావతి అమర లింగేశ్వర ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు.

శివరాత్రి వేడుకల్లో ఘనంగా ఏర్పాట్లు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని హుకుంపేట మండలం మత్స్యగుండంలో శివరాత్రి మహోత్సవాలు ప్రభుత్వం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా శివ నామ స్మరణే కనిపిస్తుంది. భక్తులు పరమేశ్వరునికి అత్యంత భక్తితో పూజాదికాలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+