గుంటూరులో పాలమూరు మహిళపై అత్యాచారం
గుంటూరు: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహిళపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా నల్లపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ముళ్లపొదల్లోకి లాక్కుని వెళ్లి మహిళపై అత్యాచారం చేసారు. ఆ తర్వాత ఆమెను చంపేశారు. అయితే, మృతురాలిని పోలీసులు సోమవారం గుర్తించారు.
మహిళకు సబంధించిన వివరాలను కూడా పోలీసులు కనుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన షేక్ సూరి (35) భర్త సలీం మరణించడంతో కూలినాలీ చేసుకుంటూ బతికేది. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన సూరి తన ఐదేళ్ల మూగచెవిటి కూతురును తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గుంటూరుకు వెళ్తూ అయోమయానికి గురై నల్లపాడు రైల్వే స్టేషన్‌లో దిగింది.

సూరి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. దాంతో కూతురికి తల్లి సూరి కనిపించలేదు. దీంతో తనతో పాటు తీసుకుని వచ్సిన రెండు దుస్తుల సంచులతో చిన్నారి అదే రైల్లో గుంటూరుకు చేరుకుంది. గుంటూరు రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నారిని పోలీసులు అదుపులోకి తీసుకుని సంచులను పరిశీలించారు.
సంచుల్లో ఉన్న బంధువుల ఫోన్ నెంబర్లను చూసి, పోలీసులు ఆ అమ్మాయి బంధువులకు ఫోన్ చేశారు. వారికి ఆమెను అప్పగించారు. చిన్నారని బంధువులు తల్లి గురించి అడిగారు. మార్గమధ్యంలో జరిగిన సంఘటన గురించి ఆమె వారికి చెప్పింది. దీంతో పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మృతురాలిని సూరిగా పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications