మహేష్ బాబు - రాజమౌళి చిత్రానికి లాంచింగ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 చిత్రం పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మించే క్రమంలో ఎక్కడా, దేనికీ రాజీపడకూడదని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. లాంఛనంగా ఈ సినిమాకు కొబ్బరికాయ ఎప్పుడు కొడతారా? అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఒక వార్త చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం చేస్తున్నారు. పక్కా ఊర మాస్ గా ఈ సినిమా రాబోతోందని, గతంలో ఎన్నడూ చూడని లుక్ లో మహేష్ బాబును త్రివిక్రమ్ చూపించబోతున్నారు. సినమాకు ముందుగా అమరావతికి అటూ ఇటూ అనే టైటిల్ అనుకున్నప్పటికీ టీజర్ పక్కా మాస్ గా రావడంతో గుంటూరు కారం అని పేరు మార్చారు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయారు. కామెరూన్ వంటి దిగ్గజ దర్శకులే రాజమౌళి ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో రాజమౌళి తర్వాత సినిమా ఏమిటా? అనే ఆసక్తి పెరిగిపోయింది. మహేష్ బాబు పక్కన కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని, హాలీవుడ్ నటీనటులు కూడా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హాలీవుడ్ లో చర్చలు పూర్తయ్యాయి. ఇండియా జోన్స్ తరహా లో భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications