'శ్రీమంతుడు' ప్రభావం: మహేష్‌బాబు దారిలో సోదరి, కంచెర్లపాలెం దత్తత
గుంటూరు: ప్రిన్స్ మహేష్ బాబు సోదరి, గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ భార్య గల్లా పద్మావతి కూడా తన సోదరుడి దారిలో నడిచారు. ఆమె గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఆమె గురువారం నాడు ఆన్ లైన్లో నమోదు చేశారు. పద్మావతి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంపై ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పద్మావతి దత్తత తీసుకుంటానని దరఖాస్తు చేసుకోగా గ్రామాభివృద్ధి కమిటీ ఆమోద ముద్ర వేసింది.

మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం శ్రీమంతుడు పలు గ్రామాలకు వరంగానే మారిందని చెప్పవచ్చు. మహేశ్ బాబు తెలంగాణలోని అత్యంత వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు చెందిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే ఏపీలోను తన తండ్రి స్వగ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మరునాడే ఆ గ్రామంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మహేశ్ సోదరి, గల్లా జయదేవ్ సతీమణి గల్లా పద్మావతి కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించి ‘శ్రీమంతుల' జాబితాలో చేరారు.












Click it and Unblock the Notifications