వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ ఆఫీసు పునాదిలోనే అవినీతి: మహేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

మళ్ళీ మొదలైన మహేష్ ట్వీట్లు...!

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ పంథాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్ట ప్రారంభంలోనే బానిసత్వం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు.

పార్టీ కార్యాలయం పునాదిలోనే అవినీతి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ రాజకీయ పంథాలో జీహుజూరీ ఉందని అన్నారు. పవన్ కల్యాణ్‌ది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదని, ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజమని అన్నారు.

నాకిస్తే అక్కడికి వచ్చేస్తా..

నాకిస్తే అక్కడికి వచ్చేస్తా..

పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన భూమి డల్ తనకు ఇస్తే పవన్ కల్యాణ్ పక్కన ప్లాట్ తీసుకుని అమరావతికి మారడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ విషయంలో తలదూర్చనని గతంలో ఇచ్చిన హామీని కాదని మహేష్ కత్తి తాజాగా వ్యాఖ్యలు చేశారు.

 వారి సహకారంతోనే పవన్ ఇల్లు

వారి సహకారంతోనే పవన్ ఇల్లు

బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతోనే జనసేన అధినేత ఇల్లు, జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణాలు రుగుతున్నాయని మహేష్ కత్తి ఆరోపిించారు. అందుకు అభినందనలు అని కూడా ఆయన అన్నారు.

మోడీ నటిస్తారు, ఆ తర్వాత పట్టించుకోరు

మోడీ నటిస్తారు, ఆ తర్వాత పట్టించుకోరు

వైజాగ్ రైల్వే జోన్ కుదరకపోతే గుంతకల్ జోన్ ఇవ్వవచ్చునని, కానీ చంద్రబాబుకు మనసొప్పదని మహేష్ కత్తి అన్నారు. రాయలసీమ అంటే రాయలసీమ నాయకులకే పట్టదని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేసేవరకు మోడీ నటిస్తారని, ఆ తర్వాత పట్టించుకోడని అన్నారు.

 చంద్రబాబు కన్నా పవన్ బెటర్

చంద్రబాబు కన్నా పవన్ బెటర్

బాబు కన్నా పవన్ బెటర్ ఈవెంట్ మ్యనేజ్మెంట్ తెలిసినవాడిలా ఉన్నాడని మహేష్ కత్తి వ్యాఖ్యానంచారు. ప్రత్యేక విమానంలో భూమి పూజ కోసం అమరావతి ప్రయాణం, భేష్ అని అన్నారు. ఎక్కడ ఉన్నామనేది కాదు, ఏం చేస్తున్నామనేది ముఖ్యమని, కానీ దాన్ని మరిపించాలంటే మాయ చెయ్యక తప్పదని అన్నారు. అవును... ఇంతకీ... ప్రత్యేక విమానం ఖర్చులు ఎవరివబ్బా అని ప్రశ్నించారు.

అది బిజెపి దిగజారుడు

అది బిజెపి దిగజారుడు

రైతులను మావోయిస్టులు అంటున్న మహారాష్ట్ర బిజెపి నేతలకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని మహేష్ కత్తి అన్నారు. కాంగ్రసు రైతులకు చేసిన అన్యాయాన్ని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ఆలోచనా విధానం ఇంతగా దిగజారడం పతనానికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Cine critic Mahesh kathi made controversial comments again on Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X