ఎక్కడ తగ్గాలో పవన్‌కు తెలుసు, అవసరం తెలియాలి: బాబుకు మహేష్ కత్తి షాకింగ్ పోస్ట్!
Recommended Video

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం ద్వారా పలుకుబడి పెంచుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తి మరోసారి జనసేనాని పైన స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైనా స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోను మనమే గెలుస్తామని, ఒకటి రెండు చోట్ల ఓడించినా బాధపడతారని చంద్రబాబు సోమవారం అన్నారు.జన్మభూమి మా ఊరు కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వేసే ఓటు తన కూలి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ పత్రిక సాక్షిలో కూడా వార్త వచ్చింది.

'వేసి సిగ్గుపడుతున్నా'
అందుకు సంబంధించిన క్లిప్పింగును మహేష్ కత్తి తన ఫేస్‌బుక్ అకౌంటులో పోస్ట్ చేశారు. 'వేసి సిగ్గుపడుతున్నారు' అని పోస్ట్ పెట్టారు. నాకు ఓటు వేయకుంటే ప్రజలే సిగ్గుపడాలని, మేం చేసిన దానికి అన్ని సీట్లు గెలిపించాలని చంద్రబాబు అన్నారని సాక్షిలో వార్త వచ్చింది. దీనిని పోస్ట్ చేస్తూ 'వేసి సిగ్గుపడుతున్నారు' అని కామెంట్ పెట్టారు.

ప్రజలు బాధపడతారని చంద్రబాబు
చంద్రబాబు మాట్లాడుతూ.. జన్మభూమిలో చేపట్టే పనులకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికలతో సంబంధం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. ఎన్నికల్లో ఓటు అనేది దానివల్ల వచ్చే ఉప ఉత్పత్తి మాత్రమే అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని, ఒకటి రెండు చోట్ల ఓడినా ఎందుకు ఓడించామా అని ప్రజలు బాధపడే పరిస్థితి వస్తుందన్నారు.

కేసీఆర్‌ను కలవడం ఏమిటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా కత్తి మహేష్ పోస్ట్ పెట్టారు. కేసీఆర్‌ను కలవడంపై స్పందించారు. 'అభినందించాలి అంటే ఫోన్ చేస్తారు. అవసరం ఉంటే వెళ్లి కలుస్తారు. పవర్ సెక్టార్ విషయంలో వివరాలు కావాలంటే డిపార్టుమెంట్ హెడ్స్‌ని అడుగుతారు. ముఖ్యమంత్రిని కాదు. ఎక్కడ తగ్గాలో... మనోడికి బాగా తెలుసు! అవసరం ఏమిటో మనకి తెలియాలి. అంతే!!' అని సంచలన కామెంట్ పెట్టారు.

రజనీకి ప్లానింగ్, పవన్‌కు ఏముంది
అంతకుముందు, 'రజనీకాంత్ కి ప్లానింగ్ ఉంది. అన్ని స్థానాలలో నిలబడి అధికారంలోకి రావాలనే ధైర్యం ఉంది. కమల్ కి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. మార్పు కోసం తపన ఉంది. పవన్ కళ్యాణ్ కి ఏముంది? కన్ఫ్యూజన్ కక్ష సాధింపు తప్ప !' అని పోస్ట్ పెట్టారు.

పవన్ పైన పోటీ చేసేందుకు సిద్ధమని
మహేష్ కత్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ ఓ జోకర్ అని, ఆయనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి ఓ జోకర్‌లా వచ్చారని, మోసపూరిత రాజకీయాలు, ఓట్లు చీల్చే రాజకీయాల్లో భాగంగానే వచ్చారని చెప్పారు. రాజకీయంగా పవన్‌ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. పవన్ దిగజారుడు రాజకీయాలను ఎండగడతానని చెప్పారు. తాను గత కొన్ని రోజులుగా తిక్క సేన, పిచ్చి సేనానితో పోరాడుతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications