వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేంద్రబాబు' నిర్ణయం కోసం వెయిటింగ్.., ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వరు?: మహేష్ కత్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినిమాలే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు మహేష్ కత్తి. కేంద్రంపై పోరాటం విషయంలో టీడీపీ, పవన్ కల్యాణ్ లు పోరాట పంథా మార్చుకోవాలని సూచిస్తున్నారు. తప్పెవరిదో తేలుస్తామంటూ పవన్ ఏర్పాటు చేయబోతున్న 'జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ' ఒక టైమ్ వేస్ట్ అని ఆయన ఇదివరకే తేల్చేశారు. తాజాగా సీఎం చంద్రబాబుపై, ఏపీ రాజకీయాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..

'కేంద్రబాబు' ఏం నిర్ణయిస్తారో..: కత్తి

'కేంద్రబాబు' ఏం నిర్ణయిస్తారో..: కత్తి

'జగన్ తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. ఉద్యమ రూపురేఖలు కార్యాచారణ నిర్ణయించారు. ప్రత్యేక హోదానే లక్ష్యం అని తేల్చేశారు. ఇక, కేంద్రబాబు సారీ చంద్రబాబు నిర్ణయం కోసం ఆంధ్రప్రజలు వెయిటింగ్ !' అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.

'ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వకుండా చేస్తారు'

'ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వకుండా చేస్తారు'

లోకసత్తా జయప్రకాష్ నారాయణ్ చేసిన పలు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మహేష్ కత్తి గట్టి కౌంటర్ ఇచ్చారు. 'APJAC or JFFC వల్ల అద్భుతాలు ఏమీ జరగవు', 'ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అరిచి గోలపెట్టకుండా సమస్యని ఎలా తీర్చవచ్చొ ఆలోచిస్తాం' అన్న వ్యాఖ్యలను మహేష్ కత్తి పరోక్షంగా తప్పు పట్టారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. 'ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ప్రజాఉద్యమం జరగకుండా చూసుకుంటారు. భేష్ !!' అంటూ కౌంటర్ ఇచ్చారు.

 'వాలెంటైన్' సెటైర్..:

'వాలెంటైన్' సెటైర్..:

ప్రేమికుల రోజు సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఓ వ్యంగ్యాస్త్రం వదిలారు కత్తి మహేష్. 'చంద్రబాబుకు మోడీ వాలెంటైన్.. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు వాలెంటైన్.. జేపీ కూడా పవన్ కల్యాణ్ వాలెంటైన్' అని మహేష్ కత్తి సెటైర్ వేశారు.

 దాంతో ఒరిగేదేమి లేదు..

దాంతో ఒరిగేదేమి లేదు..

ఇక పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయబోతున్న జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (JFFC)ని 'జాయింట్ ఫన్ కమిటీ' అని మరో ట్వీట్ లో సెటైర్ వేశారు కత్తి మహేష్.

'కొత్తగా ఏర్పడిన జేఎఫ్‌సీ మాకు చిత్తశుద్ధి తప్ప బలం లేదని చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. కావాల్సింది బలమున్నోళ్లే. ఉద్యమ తెగువున్నోళ్లు. పోరాట పటిమ ఉన్నోళ్లు. చిత్తశుద్ధి ఒక్కటి ఉంటే సరిపోని టైం ఇది. ఇక టైపాస్, టైంవేస్ట్ ఆపండి' అంటూ అంతకుముందు మహేష్ కత్తి సూచించారు.

English summary
Kathi Mahesh said that Pawan has no essential learning about bifurcation issues and is henceforth looking for help of Undavalli or JP like individuals. He taunted at Pawan’s new Joint-Fact Finding Committee set up of Joint Action Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X