‘కప్పట్రాళ్ల’ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
కర్నూలు: కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. 21 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కోర్టు తీర్పు ముందు నుంచీ హత్య కేసులో నిందితుడైన దివాకర్ నాయుడును పరారీలో ఉన్నాడు. దివాకర్ నాయుడు తన భార్యతో రైల్వే స్టేషన్‌లో ఉండగా, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు అతడ్ని పట్టుకున్నారు.
కప్పట్రాళ్ల హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. 2008, మే 17న కప్పట్రాళ్ల నుంచి వెంకటప్ప నాయుడు ఆయన అనుచరులతో కలిసి వాహనంలో కోడుమూరుకు బయలుదేరిన సమయంలో అతడ్ని హత్య చేయాలని ప్రత్యర్థులు పథకం వేసుకున్నారు.
మాచాపురం వద్ద మాటువేసిన ప్రత్యర్థులు వెంకటప్పనాయుడు వాహనాన్ని లారీతో ఢీకొట్టారు. అనంతరం బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటప్పనాయుడుతోపాటు మరో 10మంది అనుచరులు కూడా మృతి చెందారు.












Click it and Unblock the Notifications