అనకాపల్లి టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం...6గురికి తీవ్రగాయాలు
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం రేబాక వద్ద టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వారిలో పరిస్థితి విషమంగా ఉన్నఇద్దరు కార్మికులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడ్డవారు రేబాక చెందిన కోన మధు, సియాద్రి శ్రీను ,గణేష్, గాజువాక డ్రైవర్స్ కాలనీకి చెందిన గోవింద కుమార్, శ్రీను, గోపీలుగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.













Click it and Unblock the Notifications