APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..! తాజా ఉత్తర్వులు..!

ఏపీలో ఆర్టీసీ (apsrtc) ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే క్రమంలో ఉద్యోగులను ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో కూడా చేర్చారు. అయితే ఈ పథకం అమలును పర్యవేక్షించే కమిటీలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు చోటులేకుండా పోయింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య సమస్యల విషయంలో వారు ప్రస్తావించే అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు సంఘాలను రాష్ట్రస్ధాయిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు పర్యవేక్షణ కమిటీలో చేర్చాలని నాయకులు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీంతో ఎట్టకేలకు వారి విజ్ఞప్తిని అంగీకరించిన ప్రభుత్వం.. ఎంప్లాయీస్ యూనియన్ తో పాటు నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్ ను సైతం ఈ కమిటీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Major Win for APSRTC Unions Government Adds Representatives to Employees Health Scheme Panel

రాష్ట్రంలో సుమారు 16 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అమలులో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈ.హెచ్.ఎస్) అమలును పర్యవేక్షించే ఉన్నత స్థాయి కమిటీలో ఆర్టీసీ నుండి ఏపీపీటిడీ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీపీటిడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌ల ప్రతినిధులను ప్రభుత్వం చేర్చడాన్ని అవి స్వాగతించాయి. ఈ కమిటీలో చేసిన అదనపు మార్పులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో త్వరలోనే ఈ కమిటీలో రెండు ఉద్యోగ సంఘాలను చేర్చబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+