మల్కాజిగిరి: జెపి సహా మహామహుల సీటు (పిక్చర్స్)

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన ఖాయమైపోయినప్పటి నుంచి మల్కాజిగిరి లోకసభ స్థానంపై పలువురు కన్నేశారు. లోకసత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ అందరికన్నా ముందున్నారు. తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ తెలుగుదేశం, బిజెపిల మద్దతు కోరారు. పైగా ఈ సీటు కోసమే అన్నట్లుగా ఆ పార్టీలతో కూటమి కట్టడానికి సిద్ధపడ్డారు.

సీమాంధ్ర నేతలు పలువురు ఈ సీటుపై కన్నేశారు. తెలంగాణ నేతల్లో కూడా ఈ సీటు కోసం పోటీ సాగింది. తెలుగుదేశం పార్టీలో ఈ సీటు పెద్ద దుమారమే రేపింది. పట్టణ, మధ్యతరగతి ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. దానికితోడు 70 శాతం మంది సీమాంధ్రకు చెందినవారున్నారు.

హైదరాబాదు శివారులో ఉన్న మల్కాజిగిరి లోకసభ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. దేశంలోని అతి పెద్ద లోకసభ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఈ నియోజకవర్గంలో జయాపజయాలను ఆంధ్ర సెటిలర్లతో పాటు క్రైస్తవులు, దళితులు నిర్ణయించే అవకాశం ఉంది. జనరల్ సీటు అయినప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి సర్వే సత్యనారాయణ ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

మొదటి నుంచీ జెపి పట్టు..

మొదటి నుంచీ జెపి పట్టు..

గత ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన లోకసత్త నేత జయప్రకాష్ నారాయణ ఈసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారు. సీమాంధ్ర ఓటర్ల కారణంగానే ఆయన గత ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి విజయం సాధించారు. ఈసారి అదే కారణంగా మల్కాజిగిరి నుంచి తాను గెలుస్తానని ఆయన భావిస్తున్నారు.

నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా..

నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా..

సిపిఎంకు అనుకూలంగా వ్యవహరించే ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం టీచర్, ఎమ్మెల్సీ నాగేశ్వర్ మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు.

సర్వే సత్యనారాయణ ధీమా..

సర్వే సత్యనారాయణ ధీమా..

గత ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఈసారి కూడా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. ఆయన ధీమాకు కారణం ఏమిటో తెలియడం లేదు.

మైనంపల్లి హనుమంతరావు తెరాస నుంచి..

మైనంపల్లి హనుమంతరావు తెరాస నుంచి..

మల్కాజిగిరి లోకసభ సీటు ఇవ్వడానికి నిరాకరించడం వల్లనే మైనంపల్లి హనుమంతరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరి మల్కాజిగిరి టికెట్ దక్కించుకున్నారు.

టిడిపి నుంచి మల్లారెడ్డి...

టిడిపి నుంచి మల్లారెడ్డి...

మల్కాజిగిరి టికెట్ కావాలని చెప్పే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, ఆ సీటు కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సీటు కోసం కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ధిక్కరించే దాకా వెళ్లారు.

జగన్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డి

జగన్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డి

మాజీ డిజిపి దినేష్ రెడ్డి జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి మల్కాజగిరి లోకసభ స్థానం దక్కించుకున్నారు. ఆయన సీమాంధ్రకు చెందనవారే. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన డిజిపిగా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+