ఆమె చేతులు అద్భుతం చేశాయి.. రూ. 25 లక్షలు గెలుచుకున్న ఏపీ మహిళ
సాధారణంగా ముగ్గు వేస్తే రూ. వందలు లేదా రూ. వేలు ఇస్తారు. కానీ ఏపీకి చెందిన ఓ మహిళ రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నిర్వహించిన ముగ్గుల పోటీలో ఆమె ప్రథమ బహుమతి సాధించారు. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 35 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ పోటీలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లా సునీత విజయం సాధించారు. తన ముగ్గుతో అందిరినీ ఆశ్చర్య పరిచారు. ఏకంగా రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. ఆమెకు సామాజిక మాధ్యమాల వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన మల్లా సునీత అద్భుతం చేశారు. తన ముగ్గుతో అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతేకాక ఏకంగా రూ. 25 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె గెలుపు సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో ఆమెకు నెట్టింట కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నిర్వహించిన ముగ్గుల పోటీలో ఆమె ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నారు. 2024 డిసెంబరు 1 నుంచి 2025 జనవరి 15 వరకు ఆన్ లైన్ వేదికగా ఈ పోటీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీల్లో 35 వేల మందికి పైగా పాల్గొన్నారు. అయితే ఈ పోటీలో సునీత వేసిన 14 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు ఉన్న ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ పోటీలో ఆమె వేసిన ముగ్గులో తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడుతుంది. సంక్రాంతి సంబరాలను ఒక్క ముగ్గులో ఆమె వివరించిన తీరు అద్భుతం. సునీత ఈ ముగ్గును 19 కిలోల పిండితో వేశారు. అది 14 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు ఉంది. ఈ ముగ్గు పూర్తి చేయడానికి రోజుకు ఆరు గంటల చొప్పున ఐదు రోజులు పట్టిందని సునీత తెలిపారు. ఆమె వేసిన ముగ్గులో సంక్రాంతి పండుగ ఉట్టిపడుతుంది. ఈ ముగ్గును ఆమె తన ఇంటి వరండాలో వేశారు. ఆగస్టు 30న గుంటూరులో జరిగిన కార్యక్రమంలో బహుమతి అందుకున్నట్లు సునీత తెలిపారు.












Click it and Unblock the Notifications