సోము వీర్రాజుకు మల్లాది విష్ణు బ్రేకింగ్ న్యూస్?
కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతాపార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైసీపీ తన అధికార ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన పోస్టర్‌పై వివాదం రగులుతూనే ఉంది. ఆ పార్టీ నాయకులు పోస్ట్ చేసిన పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దీన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు తమపై అన్ని విషయాల్లోనూ బురద జల్లుతున్నాయని మండిపడ్డారు.

హిందువులకు వ్యతిరేకంగా వైసీపీ పోస్ట్ చేసిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ ఆరోపణలు చేయడం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. అసలు, ఈ వ్యాఖ్యలు చేయడానికి బీజేపీ నేతలకు అర్హత లేదని, తెలుగులో చేసిన ట్వీట్‌కు నానార్థాలు తీయొద్దని హితవు పలికారు.
కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతాపార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కన్నా దెబ్బకి సోము వీర్రాజు ఏమి మాట్లాడుతూన్నారో అర్థం కాకుండా ఉందని, గతంలో టీడీపీ- బీజేపీ ప్రభుత్వంలో కూల్చిన దేవాలయాలను తాము క్రమపద్ధతిలో తిరిగి నిర్మిస్తున్నామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని, సోము వీర్రాజు ఒక గాడిద అని, ఆయన్ను అనడానికి ఈ మాట కన్నా దిగజారుడు పదం ఇంకేమైనా ఉందో చూసుకోవాలని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications