పార్లమెంటే కాదు: టిపై మమతాగ్రహం, సోనియాపై హరి

Mamata fires at Congress
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) ఆమోదం తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం నిప్పులు చెరిగారు. ఆమె న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఎపి రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంటరీ సంప్రదాయాలన్నింటిని గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నింటిని తుంగలో తొక్కారన్నారు.

ఇది అసలు పార్లమెంటే కాదన్నారు. రాజ్యసభలో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరుతామన్నారు. తాను ఏ పార్టీని వ్యతిరేకించడం లేదని, సభ నిర్వహణ తీరును తప్పు పడుతున్నానని వ్యాఖ్యానించారు. లోకసభ జరిగిన తీరుపై రాష్ట్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, గంభీరమైనదన్నారు. తెలంగాణకు తాము అనుకూలంగా ఓటేస్తామా లేక వ్యతిరేకంగా ఓటేస్తామా అన్నది విషయం కాదన్నారు.

విభజన తీరు మాత్రం విపత్తులాంటిదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని, ప్రజాస్వామ్యాన్ని అందరు అనుకరించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో నాయకులు అందరు ఏమయ్యారని ప్రశ్నించారు. ఓటింగ్ లేకుండా బిల్లును ఎలా పాస్ చేస్తారని ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత బాధాకరమైన దినమన్నారు.

సోనియాపై హరికృష్ణ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన టిడిపి నేత నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. సోనియాను ఇటలీకి తరిమి కొట్టాలని లేదంటే దేశాన్ని ముక్కలు చేస్తారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+