భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్న వ్యక్తి

నెల్లూరు: భార్యాభర్తల మధ్య గొడవ అత్యంత దారుణమైన సంఘటనకు దారి తీసింది. మద్యం వ్యసనం దానికి తోడైంది. నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి పురుషాంగాన్ని కోసేసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి భార్యతో ఘర్షణకు దిగాడు. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

వాగ్వివాదంలో ఒళ్లు మరిచిన వ్యక్తి తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గొడవ సమయంలో భార్య వంట చేస్తోంది. ఈ సమయంలో పెనంలోని నూనె ఒంటి మీద పడడంతో ఆ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి.

Man cuts off genitals in fight in Nellore district

పోలీసుల కథనం ప్రకారం - నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన శేషయ్య అనే 45 ఏళ్ల వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. గత మూడేళ్లుగా భార్యను రాచి రంపాన పెడుతున్నాడు. దాంతో ఆమె విడిగా ఉంటోంది. ఆదివారం రాత్రి శేషయ్య భార్య ఉంటున్న ఇంటికి వచ్చాడు.

భార్యను శేషయ్య డబ్బులు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో అతను పురుషాంగాన్ని కోసేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+