టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని అన్నాహజారే టీం సభ్యుడి డిమాండ్!
అమరావతి: టీడీపీ ఎంపీలు అందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నాహజారే జట్టు సభ్యులుగా చెప్పుకున్న ఒకరు టీడీపీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ లోకసభ, రాజ్యసభ ఎంపీలు అందరూ రాజీనామా చేసేవరకు, సీఎం చంద్రబాబు మనసు మారే వరకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
ఆయన తొలుత లెనిన్ సెంటర్లో జాతీయ జెండాతో కాసేపు నిరసన తెలిపారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి ఆమరణ దీక్ష చేపడతానని కరపత్రాలు పంచారు. అరెస్టు చేసి జైల్లో పెట్టినా దీక్ష కొనసాగిస్తానన్నారు. అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని, రాత్రి విడుదల చేశారు.

ఏపీకి హోదా ఉద్యమ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగు సెగ బాగానే తగలబోతోంది. బీజేపీపై ఇక్కడ ఉన్న వ్యతిరేకత కర్నాటకలోని తెలుగువారి రూపంలోను కనిపిస్తుందని అంటున్నారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటుతో బుద్ధి చెబుతారంటున్నారు.
ఏపీకి హోదా నిరాకరణ, విభజన హామీల విస్మరణ వంటి కారణాలతో కర్ణాటకలోని ఏపీ వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తరాల కిందటే ఇక్కడికి తరలివచ్చిన తెలుగువారితో పాటు ఉపాధి కోసం వచ్చినవారు చాలామంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతున్నారట.












Click it and Unblock the Notifications