విశాఖ: మైనర్ బాలికపై 3 రోజుల పాటు అత్యాచారం
విశాఖపట్నం: విశాఖ తీరంలో ఘోరం చోటుచేసుకుంది. మహారాణిపేటలోని ఓ ఇంట్లో 14ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మూడు రోజులుగావీరబాబు అనే వ్యక్తి మైనర్ బాలిక చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం ఉదయం రంగంలోకి దిగిన పోలీసులు బాలికకు విముక్తి కలిగించి, వీరబాబును అరెస్టు చేశారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వీరబాబును పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇక బాలిక సొంత ఊరు విశాఖ జిల్లాలోని తునిగా తెలుస్తోంది. బాలికను మాయమాటలతో వీరబాబు లొంగతీసుకుని, ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
మూడు వారాల కిందట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఎన్ని చట్టాలు తెచ్చినా నగరంలోని మహిళలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. వరుస ఘటనలతో ప్రజల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది.












Click it and Unblock the Notifications