తల్లీకూతుళ్లతో అక్రమ సంబంధం: చంపేసి శవాన్ని గోనె సంచీలో కుక్కేశారు
కర్నూలు: ఒకే సమయంలో తల్లీకూతుళ్లతో వివాహేతర సంబంధం నడిపిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. తల్లికి తెలియకుండా కూతురితో, కూతురికి తెలియకుండా తల్లితో అతను లైంగిక సంబంధం కొనసాగించాడు. కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఇటీవల అతను హత్యకు గురయ్యాడు.
నాగశేషుడు అనే 50 ఏళ్ల వ్యక్తి స్థానికంగా ఏ మహిళతో పాటు ఆమె కూతురుతోనూ వివాహేతర సంబంధం కొనసాగించాడు. అది బయటపడడం వల్లనే అతను హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. ప్రకాశ్ నగర్‌కు చెందిన నాగశేషుడుకు భార్య, పిల్లలు ఉన్నారు.

అతను స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అమెకు తెలియకుండా ఆమె కూతురుతోనూ సంబంధం పెట్టుకున్నాడు. అయితే, కొన్నాళ్లు వ్యవహారం గుట్టుగా నడిచింది. అది సోమవారం బట్టబయలు అయింది. దీంతో తల్లీకూతుల్లిద్దరూ కలిసి నాగశేషుడ్ని సోమవారం రాత్రి హత్య చేశారు.
శవాన్ని గోనెసంచీలో పెట్టి కిలోమీటర్ దూరంలో గల కంప చెట్లలో పడేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంగళవారం ఉదయం హత్య సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా ఈశర్వమ్మను, ఆమె కూతురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రవికృష్ణ పరిశీలించారు.












Click it and Unblock the Notifications