పొలం తగాదాలతో అన్నను నరికి చంపిన తమ్ముడు
ఒంగోలు: పొలం తగాదాలో ఓ తమ్ముడు అన్నను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని పామూరుపల్లె గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. జయమ్మ పెద్ద కుమారుడు పాలుగుళ్ళ రామకృష్ణారెడ్డి (32) వివాహం చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా గ్రామంలోనే వేరే గృహంలో జీవనం సాగిస్తున్నాడు.
చిన్న కుమారుడు పాలుగుళ్ళ శివరామిరెడ్డి తన భార్య, పిల్లలతో కొమరోలులో కాపురం ఉంటూ పొలం పనుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి పోతుం టాడు. సోదరులు ఇద్దరూ పొలం విషయమై ఎప్పుడూ గొడవ పడుతుండేవారు.
కానీ డిసెంబరు 31వ తేదీన పొలం గొడవ విషయంలో రామకృష్ణారెడ్డ్డి, శివరామిరెడ్డిలు పామూరుపల్లెలోని తల్లి స్వగృహం వద్ద తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. ఆ గొడవలోనే రామకృష్ణారెడ్డిని జనవరి 1 నాటికి హతమారుస్తానంటూ హెచ్చరించి వెళ్లిపోయాడు.

జనవరి 1న తల్లికి శుభాకాంక్షలు చెప్పాలని రామకృష్ణారెడ్డి తల్లి వద్దనే 31వ తేదీ రాత్రి నిద్రించాడు. ఈ విషయం తెలుసుకున్న శివరామిరెడ్డి తాను అనుకున్న పథకం ప్రకారం జనవరి 1 తేదీ వేకువజామున 2 గంటల సమయంలో నిద్రిస్తున్న రామకృష్ణారెడ్డిని శివరామిరెడ్డి మొద్దు కత్తితో ముఖం, మెడ, చేతులపై కిరాతకంగా నరకడంతో తీవ్ర రక్తశ్రావంతో అతను అరుస్తూ పడిపోయాడు.
శివరామిరెడ్డి సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. రామకృష్ణారెడ్డ్డి వేసిన కేకలకు జయమ్మకు మెలకువ రావడంతో పెద్దకుమారుడు నిద్రిస్తున్న గదిలోకి వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు రామకృష్ణారెడ్డిని తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
స్థానిక ఎస్సై టి.బాలకృష్ణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను, తల్లి జయమ్మను విచారించారు. జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications