భార్యను కత్తితో పొడిచి చంపాడు: ఉరి డ్రామా ఆడాడు
కడప: కడప జిల్లా ముద్దునూరు మండల పరిధిలో గల పెనికలపాడు గ్రామంలో శనివారం రాత్రి తెల్లపోరి లత (30)ను ఆమె భర్త చండ్రాయుడు హత్య చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు. పెనికలపాడు గ్రామానికి చెందిన లత, చండ్రాయుడులకు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శని వారం రాత్రి తిరుపతికి వెళ్తుండగా పిల్లలను కూడా తిరుపతికి తీసుకెళ్లే విషయమై ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంలో అతను మచ్చుకత్తితో తలపై కొట్టడంతో లత చనిపోయింది. ఈవిషయాన్ని దాచి ఉరి వేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించారు. లత బంధువులు గాయాలను గుర్తించారు.
నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని మృత దేహం
ఇదిలావుంటే, కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు సమీపంలోని చెయ్యేరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నదిలో 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానిలకు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు మూడు రోజులపాటు మృతుడు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications