పెళ్లయిన పక్షం రోజులకే భార్యని హత్య చేసిన భర్త

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ కిరాతక భర్త తన భార్యను పొట్టన పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకున్న 15 రోజులకే భార్యను హత్య చేసి మాయ చేసేందుకు ప్రయత్నించాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మద్దూరు మండలం రెనిపట్లలో జరిగింది.

రెనిపట్ల గ్రామానికి చెందిన గోవిందమ్మ (19)కు అమ్మానాన్నలు లేరు. అన్నయ్యనే అన్నీ అయి పదిహేను రోజుల క్రితం పెళ్లి చేశాడు. మద్దూరుకు చెందిన గోపాల్ (25) అనే వ్యక్తికి 31,500 నగదు, 3 తులాల బంగారం కట్నంగా ఇచ్చి ఆమెను కట్టబెట్టాడు.

Man kills wife in Mahaboobnagar

వ్యవసాయం పనులు, ఉపాధి హామీ పనులు చేసుకునే గోపాల్‌పై గతంలో చిన్నపాటి దొంగతనాలకు సంబంధించిన కేసులున్నాయి. గోవిందమ్మ మంగళవారంనాడు అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు బాగానే ఉన్నట్లు కనిపించింది.

తెల్లారిసరేకల్లా గోవిందమ్మ ఉరేసుకున్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన గోవిందమ్మ అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+