అనుమానం: భార్యను తాగేసిన బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన భర్త

నెల్లూరు: బీరు బాటిల్‌తో భర్త పొడవడంతో భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన దుత్తలూరులో చోటుచేసుకుంది. సంగం మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన మణి, ప్రభావతమ్మ (38) అనే దంపతులు దుత్తలూరులో ధనుంజయ అనే రైతు వేసిన మినుము పంటకు కాపలాగా వచ్చారు.

సోమవారం రాత్రి మణి మద్యం మత్తులో భార్యను బీరు బాటిల్‌తో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మణి భార్య ప్రవర్తనపై అనుమానంగా ఉండేవాడు. సోమవారం రాత్రి ఇరువురు మద్యం సేవించి ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యపై ఉన్న అనుమానంతో మణి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.

మద్యం మత్తులో మహిళపై దాడి

Man kills wife with beer bottle in Nellore district

నెల్లూరు నగరంలోని బుజబుజనెల్లూరు గ్రామంలో ఆంజనేయస్వామి గుడి దగ్గర మద్యం మత్తులో మహిళపై దాడి జరిగింది. పోలీసుల కథనం మేరకు బుజబుజ నెల్లూరులోని ఆంజనేయస్వామి గుడి వద్ద బస్సు కోసం అక్కడ నిలబడి ఉన్న లక్ష్మిదేవిపై అటుగా వస్తున్న ఎస్‌కె హుస్సేన్ మద్యం సేవించి గొడవకు దిగాడు. ఈ క్రమంలో బండరాయితో లక్ష్మిదేవి తలపై గట్టిగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వారు తెలిపిన సమాచారం మేరకు ఐదో నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్రచందనం స్మిగ్లింగ్‌లో అరెస్టులు

ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రక్రియలో స్వైర విహారం చేస్తున్న నలుగురు ప్రధాన నిందితులతో సహా 14 మంది కూలీలను అరెస్ట్ చేయడంతో పాటు వారి ఆధీనంలో ఉన్న సుమారు 55 లక్షల రూపాయల వరకు విలువైన ఎరచ్రందనం దుంగలు, వాటిని తరలించేందుకు ఉపయోగిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా

సమావేశంలో నెల్లూరు నగర డిఎస్పీ మగ్బూల్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని గుప్తాపార్కు సెంటర్ నారాయణరావుపేట వద్ద నివాసం ఉంటున్న అంబూరి కృష్ణ, కలువాయికు చెందిన మేకపాటి సుబ్బారెడ్డి, రాపూరు మండలం తెగచర్లకు చెందిన ఈగ సాంబశివరెడ్డి, అనంతసాగరం మండలం చాపురాళ్లపల్లికి చెందిన సన్నపరెడ్డి ఈశ్వరరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రక్రియలో ప్రధాన రవాణాదారులుగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా చెన్నైకు చెందిన 14 మంది కూలీలను మల్లెంకొండ అటవీ ప్రాంతం వద్ద అరెస్ట్ చేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+