భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పంటించిన భర్త, తెనాలిలో వ్యక్తి దారుణ హత్య
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యగు గురయ్యాడు. పట్టణంలోని స్థానికి రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడిఉండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గమనించారు.

అతని ఒంటిపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పంటించిన భర్త
భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పంటించిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది. గిద్దలూరు పట్టణంలోని శ్రీరామ్‌నగర్ 7వ వార్డులో భార్యపై అనుమానంతో భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఫర్నిచర్, ఇంటి పరికరాలు కాలి బూడిదయ్యాయి. రూ. 3 లక్షల ఆస్తినష్టం జరిగింది.












Click it and Unblock the Notifications