వర్సిటీలో అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు, అరెస్ట్

గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని స్నానం చేస్తుండగా ఓ విద్యార్థి సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఘటన వెలుగు చూసింది. విద్యార్థిని కేకలు వేయడంతో విద్యార్థి పరారయ్యాడు. అతని పేరు శ్రీకర్ అని తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేశారు.

శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థిని పట్ల మరో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పెదకాకాని పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఒకేషనల్‌ ట్రెయినింగ్ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ క్లీన్‌ ఎనర్జీ శిక్షణకు దేశవ్యాప్తంగా ముప్పై మంది విద్యార్థినులు యూవర్సిటీకి వచ్చారు.

ఈ నెల 1 నుంచి 9 వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. విద్యార్థినులు పది రోజులపాటు వర్సిటీలో ఉండేందుకు గెస్ట్ హవుస్ ఇచ్చారు. హైదరాబాద్‌ కళాశాలలో బీబీఏ కోర్సు చదువుతున్న పదిమంది విద్యార్థులు ఇండస్ట్రియల్‌ టూర్‌లో భాగంగా వర్సిటీ ఐబీఎం విభాగాన్ని సందర్శించేందుకు రెండు రోజుల కిందట వర్సిటీకి వచ్చారు.

Man secretly watches while girl bathing

వీరికీ వర్సిటీ అతిథి గృహంలో వసతి సదుపాయాన్ని కల్పించారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన విద్యార్థిని స్నానం చేస్తుండగా పక్క గదిలో ఉన్న హైదరాబాద్ కళాశాల విద్యార్థి ఒకరు సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడని రిజిస్ట్రారు రాజశేఖర్‌కు బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్‌ ఫిర్యాదును పెదకాకాని పోలీసులకు పంపారు.

పోలీసులు వర్సిటీకి చేరుకుని అతిథిగృహంలో ఉన్న విద్యార్థులకు ఖాళీ చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెల్‌తో ఫొటో తీసిన విద్యార్థిని స్టేషన్‌కు పిలిచి విచారించారు. అతడి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేశారు. తాను తీసిన ఫొటోను సెల్‌ నుంచి తొలగించినట్లు విద్యార్థి అంగీకరించాడు. సహచర విద్యార్థుల సెల్‌ఫోన్లనూ పోలీసులు తనిఖీ చేశారు. కాగా, నిందితుడి పేరు శ్రీకర్ అని తెలుస్తోంది.

అద్దంకి పాతబస్టాండులో అగ్ని ప్రమాదం

ప్రకాశం జిల్లా అద్దంకి పాత బస్టాండ్‌ సెంటర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం మూడు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. పాతబస్టాండ్‌ సెంటర్‌లోని అల్పాహారశాలలో గ్యాస్‌ సిలిండర్‌ లిక్‌ కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది.

టిఫన్ సెంటర్ నుంచి ఎగిసిపడిన మంటలు పక్కనే ఉన్న కూరగాయల దుకాణం, ఫర్నీచర్‌ దుకాణాల్లోకి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దాదాపు రూ.25 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిది.

అదృశ్యమైన విద్యార్థుల కోసం అడవిలో గాలింపు

కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో శనివారం ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన విద్యార్థులు నవీన్‌, సౌందర్యగా గుర్తించారు. కడప అడవుల్లో చిక్కుకున్నట్లు విద్యార్థిని సౌందర్య తండ్రికి ఫోన్లో తెలిపింది. విద్యార్థుల కోసం పోలీసులు అడవిలో గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+