చాక్లెట్ ఆశ చూపి .. బాలుడ్ని కూడా వదిలిపెట్టకుండా కామాంధుడి లైంగిక దాడి ; ఏపీలో షాకింగ్ ఘటన
బాలికలపై ఆకృత్యాలు మాత్రమే కాదు, బాలురపై లైంగిక దాడులు కూడా ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. సమాజంలో చిన్నారులకు రక్షణ లేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఆడా మగా తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. నాగరిక సమాజంలో ఆటవికత రాజ్యమేలుతుంది. నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి.

కృష్ణా జిల్లాలో చాక్లెట్ ఆశచూపి బాలుడిపై లైంగిక దాడి
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొండపల్లిలోని శాంతి నగర్ లో ఓ ఆరేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కొండపల్లి లోని శాంతి నగర్ ఇందిరమ్మ కాలనీలో ఆరేళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా, ఆ సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి పిల్లవాడికి చాక్లెట్ కొనుక్కోడానికి డబ్బులు ఇస్తానని ఆశ చూపి పక్కనే ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ బాలుడిపై ఆ వ్యక్తి లైంగిక దాడికి దిగా

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
దీంతో అస్వస్థతకు గురైన బాలుడు ఆ తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక దాడితో అస్వస్థతకు గురైన బాలుడు ప్రస్తుతం చికిత్స నిమిత్తం గుంటూరు జిజిహెచ్ కు తరలించారు పోలీసులు. అత్యాచారానికి గురైన బాలుడు ప్రస్తుతం గుంటూరు జిజీహెచ్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాలుడిని, బాలుడి కుటుంబాన్ని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు.

బాలుడిని చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలింపు,ఆసుపత్రికి వెళ్ళిన దేవినేని ఉమా
వైద్యులు బాధిత కుటుంబ సభ్యులతో బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత కూడా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసుల తీరుపై, వైసీపీ పాలనపై మండిపడ్డారు. అంతేకాదు ఈ ఘటనను బయటకు తెలీకుండా పోలీసులు దాచిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బాలుడిపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. వైసిపి పాలనలో అరాచక శక్తులు పెచ్చుమీరి పోతున్నాయి అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి అని జగన్ సర్కారు తీరు పై దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.
Recommended Video

ఏపీలో మైనర్ బాలలపై పెరిగిపోతున్న అత్యాచారాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మైనర్ బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఇక యువతులపై ప్రేమ పేరుతో కొనసాగుతున్న దాడులు కూడా పెరిగిపోయాయి. వరుస ఘటనల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ పనితీరు ను టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసులు ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నిస్తున్నాయి. దిశా వంటి చట్టాన్ని తీసుకు వచ్చినా, నేరస్థులకు ఎందుకు ఇప్పటి వరకు శిక్షలు పడడం లేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇంతగా కామ పిశాచులు రెచ్చిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా రాష్ట్రంలో తాజా పరిణామాలు, నిత్యకృత్యంగా మారిన అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి అన్న భావన అటు ప్రజల్లోనూ వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications