హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుస్తెల తాడు కోసం మహిళ గొంతు కోశాడు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్నేహితుడితో కలిసి బంధువు ఇంటికొచ్చిన పాత నేరస్తుడు గృహిణి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొనే ప్రయత్నం చేశాడు. గృహిణి అతడ్ని ప్రతిఘటించగా కత్తితో మెడపై గాట్లు పెట్టి పరారయ్యాడు. సూరారం గ్రామానికి చెందిన మాసిరెడ్డి పాల వ్యాపారం చేస్తుంటాడు.

మెదక్‌ జిల్లా గోమారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడి ఇతడికి వరుసకు బావమరిది అవుతాడు. అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఇటీవల వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి 10 వేలు అప్పు కావాలని అడగగా మాసిరెడ్డి ఇవ్వలేదు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో శ్రీనివాస్‌రెడ్డి స్నేహితుడితో కలిసి బైక్‌పై మాసిరెడ్డి ఇంటికి వచ్చాడు.

మెహిదీపట్నంలో తనకు పని ఉందని, బైక్‌ ఇక్కడ పెట్టి వెళతానని, మళ్లీ వచ్చి తీసుకువెళతానని చెప్పాడు. మునిరెడ్డి అంగీకరించకపోవడంతో వెళ్లిపోయిన శ్రీనివాస్‌రెడ్డి సాయంత్రం 4 గంటల సమయంలో మళ్లీ వచ్చాడు. ఆ సమయంలో మాధవి ఇంట్లో ఒంటరిగా ఉన్నది. తాగేందుకు మంచి నీళ్ళు ఇవ్వగా ఆమె మెడలోని బంగారు గొలుసును శ్రీనివాస్‌రెడ్డి లాగే ప్రయత్నం చేశాడు. అయితే, మహిళ ప్రతిఘటించడంతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు.

కేకలు వేసింది..

కేకలు వేసింది..

మహిళ మాధవి అతడ్ని ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో కత్తితో ఆమె మెడపై గాట్లు పెట్టాడు. ఇరుగుపొరుగు రావడంతో స్నేహితుడితో కలిసి పరారయ్యాడు.

పాత నేరస్థుడే..

పాత నేరస్థుడే..

గాయపడ్డ మాధవి మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీనివాస్‌రెడ్డి ఓ కేసులో ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చాడని మాసిరెడ్డి తెలిపారు. దుండిగల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరూ పారిపోయారు..

ఇద్దరూ పారిపోయారు..

స్థానికులు దొంగ.. దొంగ అంటూ కేకలు వేయడంతో బైక్‌పై శ్రీనివాస్ రెడ్డి, అతనితో పాటు వచ్చిన వ్యక్తి పారిపోయారు. ఎదురుగా బౌరంపేట నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ వ్యక్తి డిసఎం డ్రైవర్, దుండగులను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితాలం లేకపోయింది.

గతంలో కూడా..

గతంలో కూడా..

శ్రీనివాస రెడ్డి గతంలో ఓ మహిళపై లైంగిక దాడి, చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలుకు వెళ్లాడు. 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి రెండేళ్ల క్రితం బయటకు వచ్చాడు.

English summary
Accused Srinivas Reddy stabbed a woman Madhavi at Suraram to steal gold chain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X