పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం, సీసీటీవీల్లో రికార్డ్

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఓ వ్యక్తి నడి రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేశాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట మహాలక్ష్మినాయుడు అనే వ్యక్తి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇవి అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. అతను కిరోసిన్ పోసుకొని, నిప్పు అంటించుకున్నాడు. గాయాలపాలైన అతనిని ఆసుపత్రికి తరలించారు.

Man suicide attempt at Pendurthi Police Station

కాగా, మహాలక్ష్మినాయుడు భార్యను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man suicide attempt at Pendurthi Police Station on Wednesday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి