పిచ్చోడని అన్నందుకు కిరోసిన్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం
అమరావతి: అనంతపురం జిల్లాలో ఓ యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం కపటలింగనపల్లెలో పొరుగింటి వారితో ఉన్న వివాదంపై పోలీసుస్టేషనుకు వెళ్లాడు.
పోలీసులు తనను పిచ్చివాడిగా చిత్రీకరించి ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపాలని ప్రయత్నిస్తున్నారనే మనస్థాపంతో యువకుడు కళ్యాణ దుర్గం సర్కిల్ కార్యాలయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడిని చికిత్స కోసం సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరస్ధితి విషమంగా ఉంది.
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లింగన్న (40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా, గత కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో లింగన్న భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన లింగన్న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications