బాలికపై రేప్: కోరిక తీర్చమన్న వీఆర్వోని వీడియో తీసి..

Man threatens girl after cheating her
హైదరాబాద్/ఏలూరు: ఓ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన పాతబస్తీ యాకుత్ పురా సెగ్మంట్ రెయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సింగ రావు అనే 29 ఏళ్ల వ్యక్తి మేస్త్రీ పని చేసేవాడు. ఆదే ప్రాంతానికి చెందిన బాలిక ట్యూషన్ నుండి ఇంటికి వెళ్లే సమయంలో నర్సింగ రావు గమనించాడు.

ఎవరు లేకపోవడంతో ఇంటిలోనికి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లి ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తీసుకు వెళ్లింది. ఈ క్రమంలో జరిగిన విషయం ఆ బాలిక తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బాలికను మోసం చేశాడు

బాలికను మోసం చేసి లోబరుచుకున్నందుకు ఓ యువకుడి పైన పశ్చిమ గోదావరి చాగల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. చాగల్లు శివారు ప్రాంతం మీనా నగరం గ్రామానికి చెందిన కోటేశ్వర రావు అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను లోబరుచుకున్నాడు.

వివాహం చేసుకోవాలని బాలిక అతనిని పలుమార్లు కోరింది. అలా అడిగితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాలిక తల్లితో పాటు వచ్చిన చాగల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

కోరిక తీర్చమన్న వీఆర్వోకు దేహశుద్ధి

పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం ఓ వీఆర్వో కీచక పర్వం వెలుగు చూసింది. ఆదాయ, కుల ధ్రవీకరణ పత్రాల కోసం వెళ్లిన కళాశాల విద్యార్థినిలను కోరిక తీర్చమంటూ వేధింపులకు గురి చేసిన వీఆర్వోను ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని చాకచక్యంగా పోలీసులకు పట్టించింది. వీఆర్వో వేధింపుల పర్వాన్ని రహస్య కెమెరాతో చిత్రీకరించిన సదరు విద్యార్థిని వీఆర్వోను ఆధారాలతో సహా బుక్ చేసేసింది.

జిల్లాలోని ఆగడాలలంక వీఆర్వో ధ్రవీకరణ పత్రాల కోసం తన వద్దకు వచ్చే కళాశాల విద్యార్థినిలను కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. వీఆర్వో వేధింపులతో విసిగిపోయిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అతడికి బుద్ది చెప్పేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది. ఆమెను సదరు వీఆర్వో ఫోన్లో వేధించడమే కాకుండా.. కార్యాలయ గదిలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో వీఆర్వోకు తెలియకుండా రహస్య కెమెరాను ఏర్పాటు చేసిన సదరు విద్యార్థిని, వీఆర్వో లీలలను రికార్డు చేసింది. అనంతరం విషయాన్ని గ్రామస్తులకు తెలిపింది. దీంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన గ్రామస్తులు బుధవారం కీచక వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో వీఆర్వోను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+