చంద్రబాబు ఆఫీస్ వద్ద కత్తితో వ్యక్తి హంగామా: మీడియాపై ఆంక్షలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి క్యాంప్ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం కలకలం చెలరేగింది. మద్యం తాగిన ఓ వ్యక్తి కత్తి పట్టుకుని హల్‌చల్ చేశాడు.
దాంతోతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. కత్తితో హల్‌చల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదిలావుంటే, విజయవాడలోని 24కె హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ప్రభుత్వం గ్రామాభివృద్ధి ప్రణాళికల ఆవిష్కరణ కార్యక్రమానికి మీడియాపై ఆంక్షలు విధించిది. దీంతో ప్రింట్, ఎలక్టానిక్ మీడియా ప్రతినిధులు హోటల్ వద్ద ఆందోళనకు దిగారు.

గుంటూరు జిల్లా గోరంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న టాటా ఏస్, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అమృతం రాజశేఖర్ అనే 17 ఏళ్ల విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. ఎనిమి రెడ్డి పూర్ణచంద్రా రెడ్డి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇరువురు కూడా నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు గుర్తించారు. గాయపడిన పూర్ణచంద్రా రెడ్డిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications