నారా లోకేష్‌తో మంచిరెడ్డి తనయుడి భేటీ: టీడీపిలో ఉంటానని కృష్ణారావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, యువనేత నారా లోకేష్‌తో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీ అయ్యారు.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి మద్దతుదారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనుకే ఉంటామని పోస్టర్ల ద్వారా మద్దతు తెలిపారు.

అయితే మంచిరెడ్డి టీడీపీ బిడ్డ అని ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది.
ఇదిలావుంటే, తాను పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కృష్ణారావు తెలిపారు. టీడీపీలోనే తాను కొనసాగుతానని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరగనున్న తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో పాల్గొంటానని కృష్ణారావు చెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications