ఏపీ రాజకీయాలపై మంచు లక్ష్మి ట్వీట్
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడంతో ఏపీ రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారాయి. అనూహ్య మార్పులకు ఏపీ వేదికవుతోంది. జనసేన పార్టీ టీడీపీతో పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయబోతున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఏపీ రాజకీయాలపైనే ప్రతి ఒక్కరి చూపు ఉంది. మంచు లక్ష్మి రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
వావ్.. ఏపీ రాజకీయాలు మరింత మజా ఇచ్చేలా మారాయన్నారు. దీంతో మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. మంచు కుటుంబం ఏ పార్టీకి మద్దతు తెలుపుతోందంటూ ప్రశ్నిస్తున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ కొద్దిరోజుల క్రితం తన భార్య భూమా మౌనికరెడ్డితో కలిసి చంద్రబాబును కలిశారు.

దీంతో మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మనోజ్ మాత్రం చంద్రబాబు ఆశీస్సుల కోసం వచ్చినట్లు ప్రకటించాడు. భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగబోతోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో లక్ష్మి ట్వీట్ వైరల్ గా మారింది. మంచు మనోజ్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. అయితే అటువంటిదేమీ లేదని మనోజ్ ఖండించారు. మరోవైపు భూమా కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లు కేటాయించాలంటూ భూమా అఖిలప్రియ తెలుగుదేశం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.












Click it and Unblock the Notifications