చిప్పనే మిగిలింది.. అది జరిగేదాకా బానిస బతుకులే: కేంద్రంపై మంచు మనోజ్

Subscribe to Oneindia Telugu
  ప్రత్యేక హోదా వచ్చే వరకు బానిస బతుకులే! కేంద్రంపై మంచు మనోజ్

  హైదరాబాద్: మహారాష్ట్రలో రైతుల పాదయాత్రకు దేశవ్యాప్తంగా స్పందన వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇప్పటికే రైతులకు మద్దతు తెలిపారు.

  మహారాష్ట్ర రైతుల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపించాలన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

   కేంద్రాన్ని నమ్ముకుంటే..:

  కేంద్రాన్ని నమ్ముకుంటే..:

  మహారాష్ట్రలో రైతుల డిమాండ్ల‌కు అంగీక‌రిస్తూ అక్కడి ప్ర‌భుత్వం లిఖితపూర్వ‌కంగా హామీలిచ్చింది అని ఓ అభిమాని చేసిన ట్వీట్‌పై మనోజ్ స్పందించారు.

  'మ‌న‌కు ప్ర‌త్యేక హోదా కూడా ఇస్తా అన్నారు. చిప్ప త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు. కేంద్రాన్ని న‌మ్మ‌ుకుంటే సంకనాకి పోతాం' అని అభిమాని ట్వీట్ కు బదులిచ్చారు మనోజ్.

   కత్తి ప్రశ్నకు మనోజ్ బదులు:

  కత్తి ప్రశ్నకు మనోజ్ బదులు:

  రాష్ట్రంలోనూ ఇక్కడి ప్రభుత్వం చాలా హామిలు నెరవేర్చలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ లేదా వైసీపీని నమ్మొచ్చా? అని క్రిటిక్ మహేష్ కత్తి కూడా మనోజ్‌ను ప్రశ్నించారు. దీనిపై వ్యంగ్యంగా బదులిచ్చిన మనోజ్.. 'నిన్ను నువ్వు నమ్ముకో బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.

  అప్పటిదాకా బానిస బతుకులే?:

  అప్పటిదాకా బానిస బతుకులే?:

  ఇక మరో నెటిజెన్ 'మరి ఎవరిని నమ్మాలి.. ప్రత్యేక హోదా అయినా, ప్యాకేజీ అయినా ఇవ్వాల్సింది కేంద్రమేగా?' అని మనోజ్ ను ప్రశ్నించాడు. దీనికి బదులిస్తూ.. 'దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటు చేసేవరకు బానిస బతుకులు తప్పవు' అని మనోజ్ ట్వీట్ చేశారు.

  ఇండస్ట్రీ స్పందన..:

  ఇండస్ట్రీ స్పందన..:

  ప్రత్యేక హోదాపై గతంలో హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, మోహ‌న్‌బాబు, బీవీయ‌స్ ర‌వి, కోన వెంక‌ట్ త‌దిత‌రులు స్పందించిన సంగతి తెలిసిందే.

  డైరెక్టర్ కొరటాల శివ.. టైమింగ్ తో చేసిన కామెంట్ బాగా పాపులర్ అయింది. భరత్ అనే నేను లోని డైలాగ్ తో మోడీపై విమర్శనాస్త్రం ఎక్కుపెట్టాడు కొరటాల. 'మోడీ ఇచ్చిన హామిలను గుర్తుచేయండి.. మోడీకి మనిసిగా మారే అవకాశం కల్పించండి' అంటూ ఇటీవలే ఆయన కామెంట్ చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tollywood Hero Manchu Manoj criticized Central govt over special status issue. Manoj said there is a need of second capital in south india, untill that central treat south indian people like slaves

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి