హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచు విష్ణుకు రాజకీయం బాగా ఒంటబట్టింది!?

|
Google Oneindia TeluguNews

గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల గురించే చర్చ నడిచింది. సాధారణంగా జరిగే రాజకీయాలను తలదన్నేలా ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేసుకుంటూ మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి ఈ ఎన్నికల్లో విష్ణునే విజయం సాధించారు. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మా' అంశం చర్చకు వచ్చింది.

 సభ్యత్వాన్ని వదులుకోవద్దని ప్రకాష్ రాజ్ కు సూచన

సభ్యత్వాన్ని వదులుకోవద్దని ప్రకాష్ రాజ్ కు సూచన


'మా' ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా సంభవించిన అనూహ్య పరిణామాలు వార్తల్లో నిలిచాయి. ఎన్నికలు జరిగిన తీరును ప్రకాష్ రాజ్ నిరసిస్తూ తన 'మా'సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఆయన ప్యానెల్ తరఫున పోటీచేసి గెలిచినవారంతా కూడా రాజీనామా చేశారు. విష్ణు ప్యానెల్ కొన్నిరోజులు వేచిచూసి ఆ తర్వాత 'వారు కోరుకున్నట్లుగానే' దూరం పెట్టింది. అయితే ప్రకాష్ రాజ్ తన 'మా' సభ్యత్వాన్ని వదులుకోవద్దని, నిర్ణయంపై పునరాలోచించాలని అందరూ కోరారు. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిపోయింది.

 ‘మా'కు వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడితే నో ఛాన్స్?

‘మా'కు వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడితే నో ఛాన్స్?


తాజాగా 'మా'అధ్యక్షుడు విష్ణు కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. తెలుగు సినిమాల్లో నటించాలంటే 'మా'సభ్యత్వం కచ్చితంగా ఉండి తీరాల్సిందేనని, అది తప్పనిసరి చేయాలంటూ నిర్మాతలకు సూచించినట్లు తెలిపారు. ఐదు సంవత్సరాలు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే 'మా'ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంటుందన్నారు. దీంతోపాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'కు వ్యతిరేకంగా ఎటువంటి పోస్టులు పెట్టినా భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులవుతారని, దీంతోపాటు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం, మీడియాకు ఎక్కడంలాంటివాటిని కూడా పరిగణనలోకి తీసుకొని వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుచేస్తామని ప్రకటించారు.

ప్రకాష్ రాజ్ కు అవకాశం లేకుండా..

ప్రకాష్ రాజ్ కు అవకాశం లేకుండా..


భవిష్యత్తులో ప్రకాష్ రాజ్ మళ్లీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండేందుకే మార్గదర్శకాలను రూపొందించిన వ్యూహమని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రకాష్ రాజ్ఎన్నికల సమయానికి వచ్చి పోటీ చేస్తానంటే కుదరదు అనేలా వీటిని రూపొందిస్తున్నారు. 'మా'కు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా అనర్హులవుతారు అనడం కూడా ప్రకాష్ రాజ్ తోపాటు మిగతా అందరినీ సైలెంట్ చేయడమేననే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రకాష్ రాజ్ కానీ, ఆయన ప్యానల్ తరఫున గెలిచినవారుకానీ స్పందించలేదు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.!

English summary
Vishnu said that in order to act in Telugu films, the membership of 'ma' must be absolute and it has been suggested to the producers to make it mandatory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X