జగన్ సాక్షి మీడియాపై ఈసికి మండవ ఫిర్యాదు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, ఛానల్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా గుర్తించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వర రావు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. సాక్షి మీడియాపై ఆయన మంగళవారం ఈసికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారని గుర్తు చేస్తూ అదే విధంగా సాక్షి పత్రిక, టీవీ ఛానల్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోను తొలగించాలని ఆయన ఈసీని కోరారు. ఆళ్లగడ్డ ఎన్నికలపై ఈసీ వైఖరి తమకు అర్థం కావడం లేదని మండవ అన్నారు.

ఇదిలా వుంటే, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మంచి నీరు లభించకపోయినా కాలువల్లో మద్యం ఏరులై పారుతోందని తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కంపెనీలోనే మద్యం డంప్ బయటపడిందని ఆయన అన్నారు.
నకిలీ మద్యం భారీగా పట్టుబడినా రావి వెంకరమణ పై చర్యలు తీసుకోడానికి ఆబ్కారీ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications