హోదా ఇవ్వని వారి ప్యాకేజీ ఎలా ఇస్తారు?: ఎమ్మెల్యే రోజా, మంగళగిరి ఎమ్మెల్యే అరెస్ట్

అమరావతి: ముఖ్యమంత్రి హోదా కోసమే చంద్రబాబు ప్రత్యేకహోదాను పక్కనబెట్టారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుపతిలో జరిగిన బైక్ ర్యాలీలో అమె పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ హోదా ఇవ్వడానికే ఇష్టపడని మోడీ ప్రభుత్వం అంతకుమించిన ప్యాకేజీ ఇస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.

మందీ మార్బలాన్ని వెంటేసుకుని ఢిల్లీ వెళ్లి, ఉత్తచేతులతో వెనక్కు వచ్చిన బాబు, ఇప్పుడు సిగ్గులేకుండా ప్యాకేజీలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొంగలా దొరిపోయిన చంద్రబాబు నాయుడు ఏపీని మోడీ కాళ్ల దగ్గర పనంగా పెట్టారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తీసుకురావడం బాబుకే ఇష్టం లేనట్టుందని ఆమె చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్రత్యేక ప్యాకేజీ ఎలా తీసుకొని వస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

 mangalagiri mla alla ramakrishna reddy arrested by police

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్

శాంతియుతంగా బంద్ పాటిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించి బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలతో పాటు 30 మంది పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బంద్‌పై గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ బంద్ పేరుతో ప్రజలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+