గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరిలో టీడీపీకి షాక్- కీలక నేత గంజి చిరంజీవి గుడ్ బై- లోకేష్ ఎఫెక్ట్-త్వరలో వైసీపీలోకి?

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ఎన్నికల్లో ఉత్కంఠ రేపిన నియోజకవర్గం మంగళగిరి. దీనికి ప్రధాన కారణం అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగడమే. అయితే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే అంతకు ముందే 2014లో ఆళ్ల చేతిలో ఓటమిపాలైన టీడీపీ నేత గంజి చిరంజీవి ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనికి కారణం 2014లో మొదలైన రాజకీయ క్రీడే. దీంతో ఈసారి మంగళగిరి నుంచి ఎలాగైనా గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న లోకేష్ పై ఈ ప్రభావం పడబోతోంది.

టీడీపీకి గంజి చిరంజీవి గుడ్ బై

టీడీపీకి గంజి చిరంజీవి గుడ్ బై

మంగళగిరిలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న చేనేత కార్మికుడు గంజి చిరంజీవి ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో వెన్నుపోట్లు సహించలేక తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. 2014లో పార్టీ తరఫున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశమిచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు చెబుతూనే వెన్నుపోట్లు సహించలేక పార్టీని వీడుతున్నట్లు ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో ప్రకటించారు. అంతే కాదు పార్టీలో తనకు ఎదురైన పరిస్ధితులపై కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీని వెనుక ఏం జరిగిందనే దాని కంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందనే దానిపైనే ఆసక్తి నెలకొంటోంది.

గంజి రాజీనామా వెనుక?

గంజి రాజీనామా వెనుక?

దశాబ్దానికి పైగా మంగళగిరిలో టీడీపీకి కీలక నేతగా ఉన్న గంజి చిరంజీవి ఇప్పుడు హఠాత్తుగా పార్టీకి గుడ్ బై చెప్పేయడం వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. 2014 నుంచి తనపై మొదలైన వెన్నుపోట్లు, అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేతిలో ఎదురైన ఓటమి వెనుక వాటి ప్రభావం వంటి అంశాల్ని ఆయన కారణంగా చూపుతున్నా అంతకు మించికారణాలే దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీని వీడి భవిష్యత్తు వెతుక్కునే పనిలో పడ్డారు.

వైసీపీలోకి ఎంట్రీ?

వైసీపీలోకి ఎంట్రీ?

ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పిన గంజి చిరంజీవి.. రేపో మాపో అధికార వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిచ్చే పార్టీలో చేరతానని ఆయన ఇవాళ ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంతో పాటు మంగళగిరిలో సైతం టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీలోకే ఆయన ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే స్ధానిక ఎమ్మెల్యే ఆర్కేకు సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో మంగళగిరిలో గంజి చిరంజీవి రాజీనామా ప్రభావం దాని చుట్టూ ఉన్న మిగతా నియోజకవర్గాలపైనా పడబోతోంది.

Recommended Video

ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే *Politics | Telugu OneIndia
లోకేష్ తో పాటు ఆర్కేపైనా ప్రభావం?

లోకేష్ తో పాటు ఆర్కేపైనా ప్రభావం?

గంజి చిరంజీవి టీడీపీకి గుడ్ బై చెప్పేయడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్దమవుతున్న నారా లోకేష్ కు ఇబ్బందికరంగా మారబోతోంది. అయితే లోకేష్ మరోసారి పోటీచేసేందుకు తీవ్ర ప్రయత్నాలుచేస్తుండటంతోనే తనకు సీటు రావడం కష్టమని భావించే చిరంజీవి టీడీపీని వీడారు.

కానీ పద్మశాలి వర్గానికి చెందిన చిరంజీవి రాజీనామాతో టీడీపీకి మంగళగిరిలో ఆ సామాజికవర్గం దూరమయ్యే అవకాశముంది. అదే సమయంలో అమరావతిలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన జగన్.. ఆయనకు బదులుగా చిరంజీవిని వైసీపీలోకి రప్పించి ఆయనకు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే జరిగితే ఆర్కే రెండుసార్లు గెలిచిన మంగళగిరి సీటులో ఆయనకు ఈసారి ఎసరు తప్పకపోవచ్చు.

English summary
senior tdp leader in mangalagiri constituency ganji chiranjeevi has quit the party today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X