మొగల్తూరులో ఇంజెక్షన్ సైకో, జల్లెడ పడుతున్న పోలీసులు
ఏలూరు: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపుతున్న ఇంజెక్షన్ సైకోను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని హోంమంత్రి చినరాజప్ప ఆదివారం చెప్పారు. ప్రజల్ని భయపెడుతున్న సైకో కోసం జల్లెడ పడుతున్నామన్నారు.
త్వరలోనే అతనిని పట్టుకుంటామన్నారు. సైకోను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇంజెక్షన్ సైకో ఆదివారం మరోసారి కలకలం సృష్టించాడు. పోలీసుల కళ్లుగప్పిన సైకో మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో ఆదివారం ప్రత్యక్షమయ్యాడు.
ముత్యాలపల్లి గ్రామానికి చెందిన హారిక అనే రెండేళ్ల చిన్నారి పైన ఇంజెక్షన్‌తో దాడి చేసి పరారయ్యాడు. బాలిక ఏడుపుతో తల్లిదండ్రులు ఘటనా స్థలంకు వచ్చారు. అప్పటికే సైకో పరారయ్యాడు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications