పవన్! రాజకీయ స్వార్థం కోసమే రెచ్చగొడుతున్నారు: మాణిక్యాలరావు ఫైర్
కర్నూలు: తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు.
సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు. కేవలం మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతులను రెచ్చగొట్టే ప్రయత్నంలో జనసేన పార్టీ ఉందన్నారు.
ఇప్పటికే 90 శాతం భూములను రాజధాని కోసం రైతులు ఇచ్చారన్నారని తెలిపారు. ఇప్పటికైనా ఇతర పార్టీలు రాజకీయ స్వార్ధం వీడి రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు.

అభ్యంతరాలున్న గ్రామకంఠాలపై రీసర్వే: పుల్లారావు, నారాయణ
గ్రామకంఠాల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం వారు గ్రామకంఠాలను పరిశీలించారు.
గ్రామకంఠాల నిర్ధారణ కొంత ఆందోళన కలిగించిందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరిస్తామని వారు చెప్పారు. దీనిపై వారం రోజుల్లో రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులతో కలిసి అభ్యంతరాలున్న గ్రామకంఠాలపై రీసర్వే చేయిస్తామన్నారు.
గతంలో చెప్పిన మేరకే డిసెంబరు 8, 2014 నాటికి వున్నటువంటి గ్రామకంఠాల ఇళ్ల జోలికి వెళ్లే పనిలేదని, ఎలాంటి భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. పవన్‌కల్యాణ్ భూసమీకరణలో భూములిస్తే తీసుకోమన్నారని, పవన్ చెప్పింది తాము ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నామని స్పష్టం చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!












Click it and Unblock the Notifications