చంద్రబాబు సతీమణి పాత్రలో మలయాళీ నటి మంజిమ?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రీకరణకు సంబంధించిన మరో కీలక పాత్ర గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో యువ కథానాయకుడు దగ్గుబాటి రానా నటిస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిగా మలయాళీ నటి మంజిమా మోహన్ నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు ద్వారా తెలిసింది.

Manjima Mohan as Chandrababu Naidu’s wife in NTR biopic?

తెలుగులో హీరో నాగ చైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో కథానాయికగా మంజిమ మోహన్ నటించారు. కాగా, భువనేశ్వరి పాత్రకు సంబందించి చిత్రీకరణ త్వరలో హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రం రెండో షెడ్యూల్ వేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Recommended Video

    Fans Wants These Golden Biopics in Tollywood ఈ బయోపిక్స్‌ వస్తాయా...!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+