రాజీనామాపై ఫోన్: ప్రధాని విజ్ఞప్తిని తిరస్కరించిన చిరు

చిరుకు ఫోన్ చేసిన ప్రధాని రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయన విజ్ఞప్తిని చిరంజీవి సున్నితంగా తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని మన్మోహన్‌కు చిరంజీవి చెప్పినట్లుగా సమాచారం.
సోనియాతో పళ్లం రాజు భేటీ
కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన పళ్లం రాజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సీమాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఆమెకు వివరించారు.
బొత్స నివాసం వద్ద ఉద్రిక్తత
విజయనగరం జిల్లాలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. వేల సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు పలుమార్లు బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసులు అక్కడ నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications