ఏపీకి 6 హామీలిచ్చా, జైట్లీ అక్కడే ఉన్నారు: మన్మోహన్, కేవీపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఇదే హౌస్‌లో (రాజ్యసభ) తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం నాడు రాజ్యసభలో చెప్పారు. అప్పుడు అరుణ్ జైట్లీ ఇక్కడే, పక్కన ఉన్నారని చెప్పారు.
తాను ఏపీకి ఆరు హామీలు ఇచ్చానని వ్యాఖ్యానించారు. నాడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మన్మోహన్ విజ్ఞప్తి చేశారు. హామీలు అమలు చేసి సభ గౌరవం కాపాడాలన్నారు. సభ ఇచ్చిన హామీలకు నాటి కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు.
తాను ప్రధానిగా హామీ ఇచ్చానని, వాటిని మీ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అప్పట్లో ఎన్నికల షెడ్యూల్ ఉన్నందున తాను ఇచ్చిన హామీల అమలు ఆగిపోయిందని చెప్పారు. నాటి ప్రభుత్వం చట్టసభల్లో ప్రకటించిన హామీలను నేటి ప్రభుత్వం విస్మరించడం తగదని, అలా అయితే పార్లమెంటుపై ప్రజలకున్న నమ్మకం పోతుందన్నారు. వెంటనే బీజేపీ నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చాలన్నారు.

సభ్యుడి హక్కు కాలరాయడమే: కేవీపీ
మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడిన అనంతరం కేవీపీ సభలో మాట్లాడారు. తాను ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు పైన పదకొండు పార్టీలు మద్దతిచ్చాయని, వాటికి ధన్యవాదాలు అన్నారు. ప్రయివేటు బిల్లు సభ్యుడి హక్కు అన్నారు. ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్టం అవసరం లేదన్నారు.
బీజేపీ దీనిని రాద్దాంతం చేస్తోందన్నారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లును మనీ బిల్లు అని చెప్పి బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లును కాదనడం సభ్యుడి హక్కును కాలరాయడమే అన్నారు.
ప్రయివేటు బిల్లు ద్రవ్య బిల్లు కాద్నారు. నాడు ప్రధాని హామీ ఇచ్చినందున ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్ట సవరణ అవసరం లేదని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వకండా ఎన్డీయే ఈ అంశాన్ని సంక్లిష్టం చేస్తోందని మండిపడ్డారు.
తాను ప్రవేశ పెట్టిన బిల్లు పైన ఓటింగ్ నిర్వహించాలని, డివిజన్ నిర్వహించాలని కేవీపీ చెప్పారు. ప్రయివేటు బిల్లును ఆమోదించిన తర్వాత ఆర్థిక బిల్లా కాదా తేల్చాలన్నారు. తన బిల్లుకు రాజ్యసభ సెక్రటరియేట్ అనుమతించిందిన్నారు. గతంలో ఈ బిల్లుపై కోరం వాయిదా పడిందన్నారు.












Click it and Unblock the Notifications