వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు - బీ అలర్ట్..!!
వేసవి తీవ్రత పెరిగింది. బయటకు వెళ్తే మాడు పగులుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు క్రమేణా పెరుగుతున్నాయి. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు జనం. తెలుగు రాష్ట్రాల్లో అధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా ఎక్కువయింది. ఈ సమయంలోనే వాతావరణ శాఖ తాజాగా అలర్ట్స్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎండతీవ్రత
వేసవి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు మరింత పెరుగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం 253 మండలాల్లో వడగాల్పులు, 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వివిధ జిల్లాల్లోని 59 మండలాల్లో వడగాల్పులు వీచగా, కడప జిల్లా వీరపునాయుని మండలంలో తీవ్ర వడగాల్పులు వీచాయి.

నలభై డిగ్రీలకు పైగా
దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటేశాయి. దీంతో పాటు వడగాలులు వీస్తున్నాయి. అటు తెలంగాణలోనూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ ఎండల్లో సొంత వాహనాల్లో ప్రయాణం మానుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ప్రమాదానికి గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
వర్షం పడే ఛాన్్
వృద్ధులు, చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెుతున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ చల్లటి సమాచారం ఇచ్చింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్‌లో వెల్లడించింది.












Click it and Unblock the Notifications