సోదరితో కలిసి వెళ్తుండగా ప్రమాదం: ఎంబీయే విద్యార్థిని మృతి, అనుమానాలు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్ఠణానికి చెందిన ఎంబీయే విద్యార్థిని గౌతమి మృతి మిస్టరీగా మారింది. బుధవారం రాత్రి నరసాపురం- పాలకొల్లు రోడ్డులో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమి మృతి చెందారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్ఠణానికి చెందిన ఎంబీయే విద్యార్థిని గౌతమి మృతి మిస్టరీగా మారింది. బుధవారం రాత్రి నరసాపురం- పాలకొల్లు రోడ్డులో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమి మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన ఆమె సోదరి ఆసుపత్రిలో కోలుకుంటోంది. అయితే ఈప్రమాదంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంబీఏ పూర్తి చేసిన గౌతమి మూడు నెలలుగా విశాఖలో గ్రూప్ 2 పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు.
పండుగ సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం సోదరి పావనితో కలసి పాలకొల్లు వెళ్లారు. తిరిగి వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది.

ఈ ఘటనలో వీరి బైక్ పంట కాల్వలోకి దుసుకుపోయింది. గౌతమికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెనుక కూర్చున్న పావనిని కారు చాలా దూరం ఈడ్చుకుపోయింది.
ఈ క్రమంలో అదుపు తప్పిన వాహనం ప్రధాన పంట కాల్వలోకి దూసుకుపోయింది. అందులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. ప్రమాదాన్ని చూసిన వారు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు చిక్కలేదు. కాగా, వీరిని ఢీకొట్టిన వాహనం రిజిస్ట్రేషన్ విశాఖకు చెందినదిగా తెలుస్తోంది. దీంతో కేసు మిస్టరీగా మారింది. పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications