టిటిడి రేసులో జ్యోతుల, ఢిల్లీ నుంచీ ఒత్తిడి: రాయపాటి తీవ్ర నిర్ణయం!?
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా నటుడు, ఎంపీ మురళీ మోహన్ దాదాపు ఖరారయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పదవి కోసం చాలామంది రేసులో ఉన్నారు.
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా నటుడు, ఎంపీ మురళీ మోహన్ దాదాపు ఖరారయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పదవి కోసం చాలామంది రేసులో ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా బడా పారిశ్రామికవేత్తల పేర్లతో సిఫార్సులు వస్తున్నాయని తెలుస్తోంది.
కానీ మురళీ మోహన్ పేరు దాదాపు ఖరారయిందని అంటున్నారు. ఆయన తదుపరి చైర్మన్‌గా నియమితులయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. టిటిడి చైర్మన్ రేసులో మురళీ మోహన్‌తో పాటు చాలామంది ఉన్నారు.

రాయపాటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారా?
ప్రధానంగా ఎంపీ రాయపాటి సాంబశివ రావు రేసులో ఉన్నారు. ఆయనకు ఈసారి కూడా పదవి దక్కకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయవచ్చునని అంటున్నారు. అలాగే రాజకీయాలకు కూడా స్వస్తి పలుకుతారని, అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ఆచితూచి
ప్రస్తుత టిటిడి పాలక మండలి ఛైర్మన్ పదవీకాలం గత నెల 26తో ముగిసింది. దీంతో కొత్త ఛైర్మన్ ఎంపిక అనివార్యమైంది. ఈ పదవి కోసం చాలామంది పార్టీ సీనియర్లు పోటీపడుతుండటంతో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

రేసులో వైసిపి నుంచి వచ్చిన జ్యోతుల
టీటీడీ పాలకమండలి ఛైర్మన్ రేసులో ఎంపిలు రాయపాటి, మురళీమోహన్, జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. వీరితోపాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, జ్యోతుల నెహ్రూ, బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఆశావహుల జాబితాలో ఉన్నారు.

ఒత్తిళ్లు
ఢిల్లీ నుంచి కూడా బడా పారిశ్రామికవేత్తల పేర్లతో సిఫార్సులు వస్తున్నాయి. దీంతో టీటీడీ ఛైర్మన్ ఎంపిక చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లో తనకు అన్యాయం జరిగిందని, టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తానన్న హామీ మీదనే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్టు బాహాటంగా ప్రకటించారు.

ఈసారి బీజేపీకివ్వాలని..
గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన సీనియర్ నేత గాలిముద్దుకృష్ణమ నాయుడు కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారనని తెలుస్తోంది. మిత్రపక్షం బీజేపీ నుంచి ఎంపి గోకరాజు గంగరాజు కూడా టిటిడి ఛైర్మెన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి బిజేపీకి అవకాశం కలిపించాలని కోరుతున్నారు.
ఉత్తర భారత్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను టిటిడి కొత్త ఈవోగా నియమించడం ఒత్తిడే కారణమనే ప్రచారం సాగుతోంది. చైర్మన్ పదవి విషయంలో చంద్రబాబు చివరికి ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాల్సి ఉంది.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications