Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావోయిస్ట్ బూబీ ట్రాప్స్ ;10 ట్రాప్స్ ను గుర్తించిన పోలీసులు, కూంబింగ్ చేస్తున్న భద్రతాబలగాలే టార్గెట్

మావోయిస్టులను ఏరివేయాలని పోలీసులు, పోలీసులకు షాక్ ఇవ్వాలని మావోయిస్టులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉనికిని చాటుకోవడం కోసం వ్యూహాలను రచిస్తున్నారు. ఇటీవల పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లతో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుండగా భద్రతా బలగాలను ఎదుర్కోవడం కోసం మావోయిస్టులు సరికొత్త వ్యూహానికి తెర తీశారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని బూబీ ట్రాప్ లను అమర్చారు మావోయిస్టులు.

ఆంధ్ర ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో 10 బూబీ ట్రాప్ లు కనుగొన్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ చత్తీస్ గడ్ సరిహద్దులో ఉన్న తూర్పు గోదావరి జిల్లా మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ స్క్వాడ్, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. అక్టోబర్ 8, 2021 శుక్రవారం నాడు ఆంధ్ర ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కూంబింగ్ కార్యకలాపాలలో నిమగ్నమైన పోలీసు బలగాలకు కనిపించిన బూబీ ట్రాప్ లు మావోల ప్లాన్ ను కళ్ళకు కట్టాయి. మొత్తం తనిఖీలలో పోలీసులు 10 బూబీ ట్రాప్‌లను కనుగొన్నారు. చింతూరు ఏఎస్పి జి కృష్ణకాంత్ మరియు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ యువకుమార్ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులో అడవిలో తవ్విన బూబీ ట్రాప్ లను కనుగొన్నారు.

Maoist booby traps; Police identified 10 traps, target combing security forces

పోలీసులను చంపేందుకే మావోయిస్ట్ ల బూబీ ట్రాప్ లు
భూమిని లోపల పది అడుగుల లోతు వరకు తవ్వి, దానిలో వెదురు బొంగులను బాణాల మాదిరిగా చెక్కి భూమిలోపలికి గుచ్చి సూది మొనల్లాంటి ఇనుప భాగాలు పైకి ఉండేలా అమర్చి, వాటి పైభాగాన ఆకులూ, అలమలతో కప్పి బూబీ ట్రాప్ లను తయారు చేసినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలోని సరిహద్దు గ్రామం మల్లంపేటలో 10 బూబీ ట్రాప్ లను కనుగొన్న క్రమంలో మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు మావోయిస్టు మిలీషియా, దండకారణ్య అడవుల దళ సభ్యులు వేసిన బూబీ ట్రాప్స్ పోలీసులను గాయపరిచి చంపడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు.

బూబీ ట్రాప్ లను గుర్తించే పరికరాలు లేవన్న పోలీసులు
ఆకులు మరియు మట్టితో కప్పబడిన బూబీ ట్రాప్‌ల పరిమాణం మరియు పదును దృష్ట్యా, పోలీసు బలగాలు అడవులలో వారి కూంబింగ్ ఆపరేషన్‌ల సమయంలో వాటిలో పడితే తీవ్ర గాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో చనిపోయే ప్రమాదం కూడా ఉందని వెల్లడించారు. పోలీసుల వద్ద ఉన్న పరికరాలతో ల్యాండ్ మైన్‌లను గుర్తించవచ్చని కానీ బూబీ ట్రాప్‌లను గుర్తించలేమని ఇచ్చారు. సరిహద్దు ప్రాంతంలో మోహరించిన భద్రతా దళాలలో భయాందోళనలు సృష్టించడానికి మావోయిస్టులు కొత్త వ్యూహాన్ని రచించినట్లు, ఇక వారి ప్లాన్ ను పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

చత్తీస్ గడ్ సరిహద్దులో 100 బూబీ ట్రాప్ లను తొలగించిన తెలంగాణా పోలీసులు
ఇటీవల తెలంగాణ పోలీసులు చత్తీస్‌గఢ్ సరిహద్దులో 100 బూబీ ట్రాప్‌లను కనుగొని వాటిని తొలగించారు. ఉచ్చులు సాధారణంగా గుంతల్లో ఏర్పాటు చేస్తారు. ఇందులో పదునైన ఐరన్ రాడ్స్ గుచ్చుకునేలా ఏర్పాట్లు, లేదా పేలుడు పదార్థాలను ఉంచుతారు. మావోయిస్టు గ్రూపులో మిలిటెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుండడంతో, గెరిల్లా మిలిటెంట్లు భద్రతా దళాలపై విధ్వంసం సృష్టించడానికి ముఖ్యంగా బూబీ ట్రాప్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పొరపాటున ట్రాప్ లో పడితే పేలుడు సంభవిస్తుంది లేదా పదునైన ఇనుప బాణాలు శరీరంలో గుచ్చుకుని చనిపోయే ప్రమాదం ఉంటుంది. కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులు, భద్రతా బలగాలు 10 బూబీ ట్రాప్ లను గుర్తించగా, ఆంధ్ర చత్తీస్ ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇంకా మరెన్ని బూబీ ట్రాప్ లు ఉన్నాయో అన్నది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+